![]() |

ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. బిబి 9 స్పెషల్ గా రాబోతోంది. ఈ షోకి సంజన, రీతూ, శ్రీజ, కళ్యాణ్ పడాల, డెమోన్ పవన్, ఇమ్మానుయేల్ వచ్చారు. "బిగ్ బాస్ ఫాన్స్ రెడీ ఐపోండి. మూడు నెలల్లో మీరు చూసిన ఎంటర్టైన్మెంట్ ని మా పరివారంలో రెండు గంటల్లో ఇవ్వబోతున్నాం" అంటూ శ్రీముఖి చెప్పింది.
"ఫస్ట్ ఏ కామనర్ ఐనా శ్రమ పడాల, కష్టపడాల అప్పుడే అవుతారు కళ్యాణ్ పడాల" అంటూ బిగ్ బాస్ సీజన్ 9 టైటిల్ విన్నర్ కళ్యాణ్ కి మంచి ఎలివేషన్ ఇచ్చాడు హరి. వెంటనే శ్రీజ "బాబులకు బాబు కళ్యాణ్ బాబు" అంటూ అరిచింది. ఇక ఇమ్మానుయేల్ ఐతే "బయట శ్రీజ చేసే హడావిడికి గెలిచింది శ్రీజానా కల్యాణ అన్న విషయాన్ని మర్చిపోయారంతా" అన్నాడు. చాలా రోజుల తర్వాత ఇమ్మానుయేల్ ని షోలో చూసేసరికి హగ్ చేసుకుంది శ్రీముఖి. "మా కమెడియన్స్ కి ఎందుకు కప్ ఇవ్వలేదు" అంటూ అవినాష్ కూడా ఒక డైలాగ్ వేసాడు.
"పవన్ ఒక కామనర్ గా అడుగు పెట్టావు తర్వాత టాప్ 3 కి వెళ్లి సూటుకేసు తెచ్చావు ఎలా అనిపిస్తోంది" అని శ్రీముఖి అడిగేసరికి అవినాష్ పవన్ లా గొంతు మార్చి "చాల హ్యాపీ అనిపిస్తోంది" అన్నాడు. "బిగ్ బాస్ హౌస్ లో నా బిగ్గెస్ట్ సపోర్ట్ ఐతే రీతూ" అంటూ డిమోన్ పవన్ చెప్పుకొచ్చాడు. దాంతో రీతూ తెగ సిగ్గు పడిపోయింది. "ది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ది మోస్ట్ జెన్యూన్ మా బుజ్జి బంగారం డిమోన్" అంటూ స్టేజి మీద పవన్ బుగ్గ మీద ముద్దు పెట్టేసింది. ఇక పవన్ ఐతే కళ్ళెగరేస్తూ అదో ఘనకారంలా ఫుల్ హ్యాపీ అయ్యాడు. ఇక ఇమ్మానుయేల్ అటు పవన్ , ఇటు కళ్యాణ్ మీద చేతులేసి చిరంజీవిలా "ఏవండీ మా తమ్ముళ్లు జెమ్స్ అండి జెమ్స్ " అంటూ ఫైనల్ డైలాగ్ చెప్పాడు.
![]() |